హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రులతో నేడు సీఎం రేవంత్ భేటీ

TG: ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై సచివాలయంలో సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తే వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లతో పాటు రాష్ట్రంలో తలెత్తే అవకాశం ఉన్న విద్యుత్ సమస్యలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.