AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. ఉ. 11 గంటలకు పున్నమి ఘాట్లో జరిగే 'జాతీయ సరస్ ఆజీవిక మేళా-2026'ను ఆమె ప్రారంభిస్తారు. మధ్యాహ్నం డ్వాక్రా మహిళలు, లఖ్పతి దీదీలతో ముచ్చటించనున్నారు. ఈ కార్యక్రమంలో CMతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. మ.2:45 గం.కు ఆమె ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
వార్తలు
సరస్ మేళాను ప్రారంభించనున్న రాష్ట్రపతి


