హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు NTR జిల్లాలో చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌కు చేరుకోనున్న ఆయన, అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి జాతీయ సరస్ మేళా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.