హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావులపెంటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

NLG: వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో బుధవారం ఐదవ రోజు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మ పేర్చి రామ రామ ఉయ్యాలో.... బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాల అనే పాటలతో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య అన్నారు. బతుకమ్మ వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.