హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాణసంచా దుకాణాల ఏర్పాటుకు లైసెన్సు'

SDPT: దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి లైసెన్స్ పొందాలని కోహెడ ఎస్ఐ పుల్లా అభిలాష్ సూచించారు. ఈ నెల 20లోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.