హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష

VKB: జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం పోలీసు అధికారులతో ఎస్పీ స్నేహ మెహ్రా నేర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దోపిడీలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీసు అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని పేర్కొన్నారు.