BHPL: రేగొండ మండల కేంద్రంలో గురువారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బంది వీధి దీపాల ఏర్పాటు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


