హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూసేకరణ పనులు వేగవంతం చేయాలి'

NRPT: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రియాంక బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, రైతుల సమస్యలపై చర్చించి గడువులోపు భూసేకరణ పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.