హైదరాబాద్: 28°C
తెలంగాణ

అబ్బాపూర్ క్రాస్‌రోడ్ వద్ద ప్రమాదం.. మహిళ మృతి

MLG: ములుగు మండలం అబ్బాపూర్ క్రాస్‌రోడ్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాణాలపల్లికి చెందిన యాట సాంబలక్ష్మి (50) మృతి చెందారు. అరటిపండ్ల వ్యాపారం కోసం ములుగు వస్తుండగా వేగంగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఎంజీఎం వరంగల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడి ఫిర్యాదుతో ములుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.