హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడిని హుండీల ఆదాయం ఎంతంటే?

కృష్ణా: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీల ఆదాయం 105 రోజులకు రూ.1,20,62,105 వచ్చినట్లు ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. బుధవారం దేవాలయ అధికారుల సమక్షంలో కానుకలను లెక్కించారు. నగదుతో పాటు 1 కిలో 900 గ్రాముల వెండి, 69 గ్రాముల బంగారం, అమెరికా 230, ఆస్ట్రేలియా 70 డాలర్లు, ఇంగ్లాండ్ 10 పౌండ్లు కానుకలుగా వచ్చాయని వెల్లడించారు.