ADB: పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో ఉన్న పురాతన శాకంబరీ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిషా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రకాష్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్, తదితరులున్నారు.
తెలంగాణ
శాకంబరీ ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్


