BDK: పాల్వంచలోని ఒడ్డుగూడెం మధుసూదన్ రెడ్డి గ్రౌండ్లో డ్వాక్రా సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న బేబీ అనే మహిళపై కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో కుక్కల సంచారం పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
పాల్వంచలో మహిళపై కుక్క దాడి


