హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాలలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

GDWL: గద్వాల్ ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం బుధవారం నుంచి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ సమీపంలో నిరవధిక సమ్మె ప్రారంభించారు. 78 కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే వేతనాలు, ఇంక్రిమెంట్లు, బకాయిల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.