హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మపై సీపీ రమేష్ సందేశం

RR: ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ పేర్కొన్నారు. పూలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.