హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ, ఈబీసీ విద్యార్థులు బ్యాంక్, ఆధార్ లింక్ చేయాలి

​మెదక్: 2026-27 విద్యా సంవత్సరానికి 9, 10 తరగతుల బీసీ, ఈబీసీ విద్యార్థులు విద్యార్థివేతనాల కోసం తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఉపేందర్ సూచించారు. మీ-సేవ కేంద్రాల్లో వివరాలు సరిచూసుకోవాలన్నారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయితేనే స్కాలర్‌షిప్ సొమ్ము నేరుగా జమ అవుతుందని ఆయన స్పష్టం చేశారు.