హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీలో చేరిన 100 మంది యువత

TPT: తిమ్మినాయుడుపాళెంకు చెందిన నాని రాయల్, అనిల్ రెడ్డి, సహా 100 మంది యువతతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ ఇంఛార్జి జేబీ శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని శ్రీనివాస్ చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.