WG: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై నిర్బంధ చర్యలు ఆపి, అక్రమ కేసులు, సస్పెన్షన్లు వెంటనే ఎత్తివేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో బుధవారం నరసాపురంలోని వివిధ సచివాలయాల్లో ఉద్యోగులను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయం ఉద్యోగులకు సీఐటీయూ మద్దతు


