హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోహిని అవతారంలో కన్యకా పరమేశ్వరి

TPT: దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల సందర్శనార్థం ఉంచారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు.