హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ధమ్మచక్ర ప్రవర్తన్ దివస్

ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో బుధవారం 70వ ధమ్మచక్ర ప్రవర్తన్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. గౌతమ బుద్ధుడిని అనుసరిస్తూ శాంతి మార్గాన్ని ఎంచుకోవడం పట్ల గర్వంగా ఉందని బౌద్ధులు పేర్కొన్నారు.