VSP: జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా విశాఖ టీడీపీ కార్యాలయంలో బుధవారం కూటమి నేతలు సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ అధ్యక్షతన జరిగిన భేటీలో, ఎమ్మెల్యేలు లేనిచోట సమన్వయకర్తలను కలుపుకుని సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. మంత్రి వీరాంజనేయ స్వామి, షరీఫ్, ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ ఎన్నికలపై కూటమి నేతల భేటీ


