BDK: మణుగూరు మండలం సమితిసింగారం గ్రామపంచాయతీ పరిధిలో ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందుతున్న తీరును, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే సమీక్ష


