హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గమ్మకు బోనాలు

SRCL: చందుర్తి మండలం రామన్నపేటలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోనాల పండగను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చి దుర్గామాతకు నైవేద్యాలు సమర్పించారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.