హైదరాబాద్: 28°C
తెలంగాణ

బండి సంజయ్‌ను కలిసిన వార్డ్ మెంబర్ నవీన్ 

MNCL: కాసిపేటకు చెందిన బీజేపీ సభ్యుడు, వార్డ్ మెంబర్ ముత్యాల నవీన్ కుమార్ యాదవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ని కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బండి సంజయ్ పిలుపు మేరకు శ్రీ మహాశక్తి ఆలయంలో ఆయనతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం నవీన్‌తో బండి కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.