NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా బుధవారం రాత్రి మహిళలు కొత్త కుండలో బోనాలు చేసి దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి నైవేద్యని సమర్పించారు. అనంతరం తీరొక్క పూలతో బతుకమ్మ ను పేర్చి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతిని చాటుకున్నారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా దుర్గామాతకు బోనాలు


