హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ

NLG: నార్కట్‌పల్లి మేజర్ గ్రామపంచాయతీ 13వ వార్డు మెంబర్ మట్టిపల్లి శ్రీను మంచి మనసు చాటుకున్నారు. దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. గ్రామ పరిశుభ్రతకు కృషి చేస్తున్న సిబ్బందిని అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. సిబ్బందికి అండగా నిలుస్తున్న శ్రీనును పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.