హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూలో జంతు సంరక్షకులకు శిక్షణ

HYD: నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన 35 మంది జంతు సంరక్షకులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీత ఎం. భగవత్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జంతువుల ఆరోగ్యం, ఆహారం, ప్రవర్తనను నిరంతరం పరిశీలించడంలో సంరక్షకుల పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.