SRPT: సైబర్ మోసాల బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ కె. నర్సింహ సూచించారు. ఈరోజు కోదాడ డివిజన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేసి శిక్షలు పడేలా చూడాలన్నారు. అక్రమ రవాణా, పేకాట, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాల నివారణపై ఎస్పీ సమీక్ష


