హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రగ్బీ బరిలో గిరిజన బాలిక

ASR: అరకులోయ మండలం రణజిల్లెడకు చెందిన గిరిజన బాలిక గౌతీ మీనన్ జాతీయ రగ్బీ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటింది. సోమెలి దాసు కుమార్తె అయిన గౌతీ, భీమిలీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌–14 రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ విజయం గ్రామానికి గర్వకారణంగా ఉందని గ్రామస్తులన్నారు.