హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు రామాయంపేటలో ఉచిత సహాయక పరికరాల పంపిణీ

MDK: రామాయంపేటలో అక్టోబర్ 15న ఉదయం 10 గంటలకు మెహర్ సాయి ఫంక్షన్ హాల్‌లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాలు పంపిణీ చేయనున్నారు. ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వ RVY, ADIP పథకాల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం జరగనుంది. ALIMCO ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.