హైదరాబాద్: 28°C
తెలంగాణ

సద్దుల బతుకమ్మకు కలెక్టర్, ఎస్పీకి ఆహ్వానం

SRCL: వేములవాడలో శుక్రవారం సాయంత్రం మూలవాగు వద్ద నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకలకు రావాలని మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లతో కలిసి కలెక్టర్ గరిమ అగర్వాల్‌ను కోరారు. ఇదే విషయమై ఎస్పీ మహేష్ బి. గితే, అదనపు కలెక్టర్ నగేష్‌లను ఆహ్వానించారు. వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ప్రత్యేక ఆనవాయితీ అని వివరించారు.