హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామారెడ్డిలో కుల బహిష్కరణ కలకలం

KMR: రామారెడ్డిలో కుల బహిష్కరణ కలకలం రేపింది.గ్రామానికి చెందిన దర్ని పోచయ్య కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని ఆవేదన చెందారు. పొరుగు రెండు కుటుంబాలతో భూమి, ఉమ్మడి దారి వివాదం ఉందని, దారికి గోడ కట్టారని తెలిపారు. కుల పెద్దలు ఏకపక్షంగా రూ.20 వేల జరిమానా వేసి శుభకార్యాలకు దూరం పెట్టారన్నారు. ఈ నెల 5న తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు.