హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముంబై నుంచి డ్రగ్స్.. కడ్తాల్‌లో పట్టివేత

RR: కడ్తాల్ టోల్‌గేట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.20 లక్షల విలువైన 170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన అజీజ్ (34), హంసత్ (32)లను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, రెండు ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు DCP నారాయణరెడ్డి తెలిపారు.