హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ.6 లక్షల సాయం

JGL: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.6 లక్షల ఆర్థిక సాయం చెక్కును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ భీమ్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబానికి చెక్కు అందించారు.