హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంది వ్యవసాయ ఇంజినీరింగ్

సంగారెడ్డి జిల్లా కంది వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం 35 మంది బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులకు గ్రీన్‌హౌస్ సాంకేతికతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ గ్రీన్‌హౌస్, హైడ్రోపోనిక్స్, ఆధునిక సాగు పద్ధతుల గురించి వివరించారు. తక్కువ స్థలంలో నీటిని సమర్థంగా వినియోగిస్తూ నాణ్యమైన పంటలను ఎలా పండించవచ్చో తెలియజేశారు.