హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘15, 16 తేదీల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు’

KNR: జిల్లాలో ఈ నెల 15, 16 తేదీల్లో ఓటరు జాబితా ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువతతో పాటు జాబితాలో పేర్లు లేని అర్హులు కొత్తగా నమోదు చేసుకోవాలని సూచించారు. పేరు, చిరునామా తదితర వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారన్నారు.