హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు సిబ్బంది కోసం టీ క్యాంటీన్ ప్రారంభం

అన్నమయ్య: మదనపల్లె జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టీ అండ్ స్నాక్స్ క్యాంటీన్‌ను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, డీఎస్పీ బి. ప్రసాద్, వెల్ఫేర్ ఆర్‌ఐ రవికుమార్‌ పాల్గొన్నారు.