హైదరాబాద్: 28°C
తెలంగాణ

12 మందికి ఇందిరమ్మ ఇళ్లు

నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని ఉందేకోడు, జంగంరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు నూతన ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ఎంపీడీవో శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వినయ్ కుమార్, ఎంపీవో రాఘవేందర్, ఏఎంసీ వైస్ చైర్మన్ డి. కృష్ణారెడ్డి పాల్గొన్నారు.