హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ షాపుల్లో పోలీసుల తనిఖీలు

నారాయణపేట పట్టణంలోని పలు మెడికల్ షాపుల్లో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వినయ్, ఎస్సై గాయత్రి ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలు, నిషేధిత ఔషధాల అక్రమ విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మత్తు కలిగించే మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాపుల నిర్వాహకులను హెచ్చరించారు.