BPT: కారంచేడు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పులి గోపి, బుధవారం మార్టూరు మండలం ఇసుక దర్శిలోని క్యాంపు కార్యాలయంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలిసిన కారంచేడు నూతన ఎస్సై


