మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థినులతో కలిసి అధ్యాపకులు సైతం బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎలిజబెత్ అనిత, సూపరిండెంట్ సునంద, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బతుకమ్మ


