ఆసిఫాబాద్లో గంజాయి సాగు, విక్రయాలను అరికట్టి యువతను కాపాడాలని డివైఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ మేరకు సీఐ నీలం రవికి వినతిపత్రం అందజేశారు. గంజాయి విక్రయదారులపై కేసులు నమోదు చేయాలని, మహిళలు, బాలికలకు రక్షణ కల్పించాలని కోరారు. యువతకు అవగాహన సదస్సులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
గంజాయి స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని వినతి


