RR: కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వేముల నర్వలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 33 గ్రాముల గంజాయి పట్టుబడింది. ఛత్తీస్గఢ్కు చెందిన రామకృష్ణ పటేల్ను నిందితుడిగా గుర్తించి కేసు నమోదు చేశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ నిల్వ, రవాణా, విక్రయం, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు.
తెలంగాణ
వేముల నర్వలో గంజాయి స్వాధీనం


