హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన పీడీ లీలావతి దేవి

NDL: బండి ఆత్మకూరు మండలంలోని ఏకోడూరు, ఈర్నపాడు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్టు డైరెక్టర్ లీలావతి దేవి బుధవారం సందర్శించారు. కేంద్రాల్లోని మౌలిక సౌకర్యాలు, పోషకాహారం, ప్రీ-స్కూల్ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.