హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ విద్యానిధి దరఖాస్తుల గడువు పొడిగింపు

BHPL: మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు భూపాలపల్లి జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఇ. ఇందిర తెలిపారు. విదేశాల్లో మాస్టర్స్, డాక్టరేట్ చదవాలనుకునే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వివరాలకు తెలంగాణ ఈపాస్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.