హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన కుటుంబాలకు ఉచిత సోలార్ లైట్లు పంపిణీ

BPT: కాలువ గట్టున సౌకర్యాలు లేక నివసిస్తున్న 10 గిరిజన కుటుంబాలకు కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ ఇనకొల్లు పోలీసురావు ఉచితంగా సోలార్ లైట్లను పంపిణీ చేశారు. బొంత శామ్యూల్ త్యాగరాజ్ సహకారంతో, వారి తండ్రి బొంత జాన్ ప్రభాకర్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ లైట్ల ద్వారా ఫోన్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చని తెలిపారు.