హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హెచ్‌ఐవీ నివారణకు సమష్టిగా కృషిచేయాలి'

SKLM: హెచ్‌ఐవీ నివారణకు, HIV బాధితులకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని జిల్లా DMHO నరేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.హెచ్‌ఐవీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు యాంటీ రెట్రో వైరల్ థెరపీ సేవలు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు.