NTR: ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో, నందిగామ పురపాలక సంఘ పరిధిలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని కమిషనర్ జీ.లోవరాజు తెలిపారు. దీనిలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ రాతలను ఆయా పార్టీల నాయకులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆయన కోరారు. పురపాలక శాఖ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్.. ఫ్లెక్సీల తొలగింపు


