హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటి సరఫరా

PLD: నరసరావుపేట పట్టణ ప్రజలకు పురపాలక సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి పట్టణంలో రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలందరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అనవసరంగా నీటిని వృథా చేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.