హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వన సంరక్షణ సమితులకు రూ.15.40 లక్షల చెక్కుల పంపిణీ

కోనసీమ: కాట్రేనికోన మండలంలోని మగసానితిప్ప, మగసానితిప్ప కాలనీ, భైరవలంక వన సంరక్షణ సమితులకు రూ.15,40,299 విలువైన చెక్కులను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పంపిణీ చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన తోటలకు ఆర్థిక ప్రోత్సాహకంగా ఈ నిధులను అందజేశారు. ఈ నిధులను సామాజిక వనాల అభివృద్ధికి, గ్రామాల ప్రగతికి వినియోగించాలని ఎమ్మెల్యే సూచించారు.