హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్యాపిలి పట్టణంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

NDL: ప్యాపిలి పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక టిడిపి నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 30 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న సిసి రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భూమి పూజ చేశారు.